పసిడి ధరలు పరుగులు పెడుతోంది. రోజు రోజుకూ బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతోన్న గోల్డ్ రేట్ ఇవాళ (డిసెంబర్ 31) కూడా భారీగా పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ.300 నుంచి రూ.330 వరకు పెరిగింది. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.50,350కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,930గా ఉంది. మరోవైపు వెండి ధరలు బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. కిలో వెండిపై రూ.1000 పెరగడం గమనార్హం. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 71,300 పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,930 పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,930 కులభిస్తోంది. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో
వెండి ధర రూ. 71,300 కాగా, ముంబైలో రూ. 71,300 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 74,500 వద్ద కొనసాగుతోంది.