తెలంగాణ రాష్ట్రాన్ని మరోసారి పలు పురస్కారాలు పలకరించాయి. స్వచ్ఛ్ సర్వేక్షన్ గ్రామీణ్‌లో రాష్ట్రానికి పలు అవార్డులు వచ్చాయి. తొలి 3 స్థానాల్లో రాష్ట్రానికి చెందిన జిల్లాలే నిలిచాయి. 2022 డిసెంబర్‌కు సంబంధించి ఈ పురస్కారాలు వచ్చాయి. నాలుగు స్టార్ల రేటింగ్‌లో మొదటి స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, రెండో స్థానంలో కరీంనగర్ జిల్లా, మూడో స్థానంలో పెద్దపల్లి జిల్లాకు అవార్డులు వచ్చాయి.
రాష్ట్రానికి స్వచ్ఛ్ సర్వేక్షన్ గ్రామీణ్ అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆయన అభినందనలు తెలిపారు. స్వచ్ఛత విషయంలో కేంద్రం ఈ అవార్డులు ఇస్తోన్న సంగతి తెలిసిందే.