సక్సెస్ అవ్వడానికి వయసుతో సంబంధం లేదు. కాన్ఫిడెన్స్ తో మనం ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. అలానే మనం చేసే పని మీద మనకి ఇష్టం ఉండాలి కచ్చితంగా సక్సెస్ అవుతామని నమ్మకం ఉండాలి. విజయ్ సింగ్ రాథోడ్ అనే వ్యక్తి కి 60 సంవత్సరాలు. 120 స్క్వేర్ ఫీట్ షాప్ లో ఆయన రుచికరమైన వెజిటేరియన్ హాట్ డాగ్స్ ని అమ్ముతారు. నిజానికి చిన్న చిన్న షాపులు పెట్టుకుంటే అంత ఎక్కువ లాభాలు రావు పైగా చాలా మంది సమోసాలు కానీ కచోరీలు కానీ అమ్మితే బాగుండేది కదా హాట్ డాగ్స్ ఎవరు కొనుక్కుంటారు అన్నట్లు ఆయనతో చెప్పేవారు.
కానీ వాళ్ళ మాటలు మాత్రం పట్టించుకోలేదు విజయ్ ప్రతి రోజు కూడా ఆనందంగా ఉండదు. కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని రోజులు ఖాళీ కడుపు తో తన కుటుంబం నిద్ర పోవాల్సిన దుస్థితి ఎదురయింది. ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా తను ఉద్యోగం చేయవలసి వచ్చింది. అప్పుడు ఐదు రూపాయల నుండి ఎనిమిది రూపాయలు ఇచ్చే వాళ్ళు. కొన్ని సంవత్సరాలు పాటు ఇలానే ఉద్యోగం చేశారు.
ఇంగ్లీష్ మూవీస్ ని ఇన్స్పైర్ గా చేసుకుని జానీ హాట్ డాగ్స్ ని 11 సంవత్సరాల అప్పుడు మొదలు పెట్టాడు. హాట్ డాగ్స్ ని సేల్ చేయడం మొదలు పెట్టక మొదట్లో కాస్త ఎత్తు పల్లాలు రావడంతో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఊబర్ ఈట్స్ వచ్చిన తర్వాత హాట్ డాగ్స్ సేల్ బాగా పెరిగింది 6 నెలల్లో ఏడు లక్షల హాట్ డాగ్స్ ని సేల్ చేశారు విజయ్. నిజంగా సక్సెస్ అంటే ఇది కదా అని చూపించారు విజయ్ సింగ్/ మనం సంపాదించడానికి వయసుతో సంబంధం లేదు అలా అని మనం చదువుకోక్కర్లేదు కూడా ఒక మంచి ఆలోచనతో ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏ వయసులో ఉన్న వాళ్ళైనా కూడా సంపాదించొచ్చు. విజయ్ సింగ్ సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచారు.