ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే ఆఫర్‌.. రూ. 46వేల ఫోన్‌..రూ. 5వేలకే.. !

-

పాత ఫోన్‌ స్లో అయిపోయిందా.. ఏదైనా కొత్త ఫోన్‌ కొనాలని చూస్తున్నారా..? కాస్ట్లీ ఫోన్‌కు డెడ్‌ చీప్‌గా కొనే బంపర్‌ ఆఫర్‌ మీకోసమే.. మీకోసం భారీ తగ్గింపు ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. పలు రకాల ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. దీంతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరలోనే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే ఆఫర్ నడుస్తుంది. మోటరోలా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 20 ప్రో ఫోన్‌పై కళ్లుచెదిరే ఆఫర్లు పొందొచ్చు. సూపర్ కెమెరాలు ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం. ఈ ఫోన్‌పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయాంటే..
మోటరోలా ఎడ్జ్ 20 ప్రో 5జీ ఫోన్‌ ఎంఆర్‌పీ రూ. 45,999గా ఉంది. అయితే దీన్ని రూ. 24,999కు సొంతం చేసుకోవచ్చు. అంటే రూ. 21 వేల తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్‌పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి..ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 20 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అంటే మీరు మీ పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ కొంటే.. రూ. 4,999కే 5జీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ ఫోన్, దాని కండీషన్‌ను బట్టి మారుతుంది.. అందువల్ల మీ ఫోన్‌కు తక్కువ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా రావొచ్చు. ఒకసారి మీ ఫోన్ ఎక్స్చేంజ్ విలువ చెక్ చేసుకోండి.

ఈఎంఐ ఆప్షన్స్‌..

ఇంకా ఈ ఫోన్‌పై ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. నెలకు రూ. 1213 చెల్లిస్తే ఈ ఫోన్ కొనొచ్చు. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 4167 చెల్లించాలి. 3 నెలల వరకు కూడా నో కాస్ట్ ఈఎంఐ ఉంది. కాగా స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్లు ఉంటాయి..

మోటరోలా ఎడ్జ్ 20 ప్రో 5జీ హైలెట్స్..

మోటరోలా ఎడ్జ్ 20 ప్రో 5జీ ఫోన్‌లో 8 జీబీ వరకు ర్యామ్ ఉంది.
128 జీబీ మెమరీ, 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, హెచ్‌డీఆర్ 10 ప్లస్, 144 హెర్జ్ రిఫ్రెష్ రేటు వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్ 5జీ సపోర్ట్ చేస్తుంది.
 కెమెరా విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే వెనుక భాగంలో 108 ఎంపీ కెమెరా ఉంది.
 ఈ ఫోన్‌లో 870 ప్రాసెసర్ ఉంది.
4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 నిమిషాలు చార్జింగ్ పెడితే 9 గంటల వరకు చార్జింగ్ నిలుస్తుందని కంపెనీ పేర్కొంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news