USలో ‘కొవాగ్జిన్‌’పై సానుకూల ఫలితాలు

-

భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవిడ్‌-19 టీకా ‘కొవాగ్జిన్‌’పై అమెరికాలో నిర్వహించిన రెండు, మూడు దశల (ఫేజ్‌-2/ 3) క్లినికల్‌ పరీక్షల్లో సానుకూల ఫలితాలు కనిపించాయి. ఈ పరీక్షల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించినట్లు యూఎస్‌కు చెందిన ఆక్యుజెన్‌ ఇంక్‌ ప్రకటించింది. యూఎస్‌లో కొవాగ్జిన్‌ టీకాను విడుదల చేయటానికి ఆక్యుజెన్‌ ఇంక్‌, భారత్‌ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

‘కొవాగ్జిన్‌’ టీకాకు అనుమతి కోసం అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డిఏ) వద్ద ఆక్యుజెన్‌ ఇంక్‌  దరఖాస్తు చేసింది. ఇందులో భాగంగా క్లినికల్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో యూఎస్‌లోని 419 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. వారికి 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల ‘కొవాగ్జిన్‌’ టీకా ఇచ్చి ఫలితాలు విశ్లేషించారు. ఎంతో అధిక రోగ నిరోధక శక్తిని టీకా ప్రదర్శించినట్లు, వైరస్‌లోని ముఖ్య యాంటిజెన్లు అయిన ఎస్‌-ప్రొటీన్‌, ఆర్‌బీడీ, ఎన్‌-ప్రొటీన్‌ లక్ష్యంగా చేసుకొని పనిచేసినట్లు ఆక్యుజెన్‌ ఇంక్‌ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news