హీరో నాని భార్య ఏం చేస్తుంటారో తెలిస్తే షాక్..!

-

నాచురల్ స్టార్ నాని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈయనను చూస్తే ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. రేడియో జాకీ గా కెరియర్ ను మొదలుపెట్టిన నాని ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు క్లాప్ కొట్టాడు. ఆ తర్వాత హీరోగా తన నటనను అభిమానులకు చూపిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. అందుకు ఉదాహరణ హిట్ సినిమాలే అని చెప్పవచ్చు. విశ్వక్సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమా విజయం సాధించగా.. అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2 సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు హిట్ 3 లో నాని కనిపించబోతున్నారు. అయితే వీటన్నిటికీ కూడా ఆయనే నిర్మాత కావడం గమనార్హం.

ఇదిలా వుండగా చాలా వరకు నాని గురించి తెలుసు.. కానీ ఆయన భార్య గురించి చాలామందికి చాలా తక్కువగా మాత్రమే తెలుసు అని చెప్పవచ్చు. అయితే నాని భార్య అంజన టాలెంట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే. అంజన ఫ్యాషన్ డిజైనింగ్ చేయడమే కాకుండా మణిపాల్ యూనివర్సిటీ నుండి కార్పొరేట్ కమ్యూనిటీలో పీజీ చేసింది. ప్రస్తుతం ఆర్కా మీడియా క్రియేటివ్ హెడ్ గా పని చేస్తూ కెరియర్ను. కొనసాగిస్తోంది..

మరోవైపు బాహుబలి సినిమాలో ప్రభాస్, అనుష్క, రానా తదితరుల కాస్ట్యూమ్స్ ని రమా రాజమౌళితో కలిసి రూపొందించింది. ఇంత టాలెంట్ చూసి నాని అభిమానులు తెగ ముచ్చట పడిపోతున్నారు. ఇకపోతే నాని అంజనను ముందుగా అంజు అని పిలుస్తారట. వీరిద్దరూ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకే నాని కూడా సోషల్ మీడియాలో రేర్ గా కనపడుతూ ఉంటారు. నాని భార్య అంజన టాలెంట్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news