హీటర్ షార్ట్ సర్య్కూట్ కావడం వల్ల తల్లి సహా ఇద్దరు చిన్నారులు సజీవదహనమైన సంఘటన హిమాచల్ ప్రదేశ్లోని హమీపూర్ జిల్లాలోని జల్లా అనే గ్రామంలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు పాల్, అతడి భార్య అనిత (28) కురారా పోలీస్స్టేషన్ పరిధిలోని జల్లా అనే గ్రామంలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు మోహిని(6), రోహిని(3) ఉన్నారు. వీరంతా నిద్రిస్తున్న సమయంలో రూమ్ హీటర్ షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో మంటలు వ్యాపించి అనితతో పాటు ఇద్దరు చిన్నారులు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిందని సమాచారం. సమచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజిన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది.