వాల్తేరు వీరయ్యలో పూనకాలు తెప్పించిన సీన్స్ ఇవే

-

గాడ్ ఫాదర్ సక్సెస్ జోష్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇవాళ థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటించాడు.

వాల్తేరు వీరయ్య ప్రీమియర్స్ చూసిన పబ్లిక్.. ఈ సినిమా ఎలా ఉంది? ముందు నుంచి చెప్పినట్లుగానే పూనకాలు తెప్పించారా అనే విషయాలు చెబుతున్నారు. ఈ టాక్ ప్రకారం చూస్తే సినిమాలో బాస్ ర్యాంపేజ్ కేకలు పెట్టించిందట. ఫస్టాఫ్ ఊహించని రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేసిందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news