కమల్ హాసన్ గురించి భారతీయ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కరలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్లు కొత్తగా మేముపాన్ ఇండియా స్టార్లు గా చెలామణి అవుతున్నారు.కాని ఎప్పుడో ముప్పై ఏళ్ళ కిందటే తన సినిమా లతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఇక తన భారతీయుడు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.
అప్పట్లో ఆ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ సినిమా కమల్ కు మరియు డైరెక్టర్ శంకర్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా కు సీక్వెల్ గా హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కలిసి ‘ఇండియన్ 2’ చేస్తున్న సంగతి తెలిసిందే.కమల్‌హాసన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే ఇప్పుడు కమల్ హాసన్ గురించి ఒక వార్త సంచలనంగా మారింది. గతంలో తాను నటించిన అభయ్ సినిమాని మళ్లీ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. వాస్తవానికి భారీ అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే ఇదే సినిమాను దేశ వ్యాప్తంగా అభయ్ ను దాదాపు వెయ్యికి పైగా స్క్రీన్స్ లో రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర దర్శక నిర్మాతలు అఫిషియల్ గా ప్రకటించడంతో ఈ సినిమా ను థియేటర్ లో చూసే దమ్ము ఉందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.