ఏ బ్యాంక్ అకౌంట్ లో ఎంత మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలి..?

-

బ్యాంక్ అకౌంట్ వున్నవాళ్లు కచ్చితంగా బ్యాంక్ లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనేది చూసుకోవాలి. బ్యాంక్ ఖాతా లో బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసుకోవాలి లేదంటే డబ్బులు కట్ అయ్యిపోతాయి. బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా ఉన్న వారికి ఎన్నో సదుపాయాలు అందుబాటులో వుంటుంటాయి.

banks
banks

ముఖ్యంగా డబ్బుకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తాయి బ్యాంకులు. అలానే ఆర్థికంగా లోన్లు వస్తాయి. ఇక ఇప్పుడు ఏ బ్యాంకు అకౌంట్ లో ఎంత మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే బ్యాంకులు పెద్ద మొత్తంలో ఫైన్లు విధిస్తుంటాయి కనుక పక్కా చూసుకోండి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:

స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉంటే మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోయినా పరవాలేదు. వారికి ఈ సౌలభ్యం వుంది. 2020, ఆగస్టు నుంచి ఈ నిర్ణయం తీసుకుంది బ్యాంకు.

HDFC బ్యాంక్‌:

HDFC బ్యాంక్‌లో అయితే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ బట్టి ఛార్జీలను విధిస్తుంటుంది. బ్యాంక్‌ లో మినిమం బ్యాలెన్స్ కచ్చితంగా ఉండాల్సిందే. ఎంత ఉండాలనేది చూస్తే.. రూరల్ బ్రాంచుల్లో అయితే రూ.2500, FD అయితే రూ.25 వేలు ఉండాలి. సెమీ అర్బన్ బ్రాంచ్‌ల్లో రూ.5000, మెట్రో బ్రాంచ్‌ల్లో రూ.10 వేల వరకు మెయింటెయిన్ చెయ్యాలి.

ICICI బ్యాంక్‌:

ఈ అకౌంట్ కలిగిన వాళ్ళు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు మెయింటెయిన్ చెయ్యాలి. రూరల్ ఏరియాల్లో రూ.2000, సెమీ- అర్బన్ లో రూ.5000, మెట్రో ప్రాంతాల్లో రూ.10 వేల వరకు ఉండాలి.

సిటీ బ్యాంక్‌:

సిటీ బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.2 లక్షల వరకు ఉండాలి.

DBS బ్యాంక్‌:

ఇక్కడ అయితే రూ.10-25 వేల వరకు ఉండాలి. అదే IDBI బ్యాంక్ లో మినిమం బ్యాలెన్స్ రూ.500 నుంచి రూ.5 వేల వరకు ఉండాలి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో రూ.500 నుంచి రూ.2 వేల వరకు ఉండాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో కూడా ఇంతే. అదే బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అయితే రూ.500 నుంచి 1000 రూపాయల వరకు ఉండాలి. యూనియన్ బ్యాంక్ లో యావరేజ్ బ్యాలెన్స్ రూ.250 నుంచి రూ.1000 వరకు ఉండాలి. అదే యాక్సిస్ బ్యాంక్‌లో అయితే రూ.2500-12 వేల రూపాయల వరకు ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news