సొంత జాగా ఉన్న వారికి కేసీఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్ కు రంగం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెడుతున్న పద్దులో కీలక పథకాలను లక్ష్యంగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.
సొంత జాగా గలవారికి ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల సాయం పథకానికి బడ్జెట్లో 1000కోట్లు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి 1000 మందికి చొప్పున సాయం అందించనుంది.
దీనికి సంబంధించిన మార్గదర్శకాలు సైతం సిద్ధమయ్యాయి. కొత్త బడ్జెట్ లో కేటాయింపుల ఆధారంగా పథకాన్ని ప్రారంభించే వీలుంది. ఈ పథకం కోసం నియోజకవర్గాల వారీగా దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన ఉన్న కమిటీ వారిని ఎంపిక చేస్తుందని తెలిసింది.