నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. అదానీ వివాదంపై విపక్షాల గురి

-

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేయనున్న ప్రసంగంతో ఇవాళ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఆర్థిక సర్వేను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. కేంద్ర ఆర్థికమంత్రి సీతారామన్.. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను సభ ముందుంచనున్నారు.

బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 14 వరకు జరగనుండగా.. రెండో విడత సమావేశాల కోసం ఉభయ సభలు మార్చి 12న భేటీ కానున్నాయి. మొత్తంగా ఏప్రిల్ 6 వరకు సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో 27సార్లు ఉభయసభలు భేటీ కానున్నాయి. ఈ సెషన్​లో 36 బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాక్రమణ, అదానీ గ్రూపుపై హిండెన్​బర్గ్ నివేదిక, బీబీసీ డాక్యుమెంటరీ, ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. ఆయా అంశాలపై చర్చించాలని..కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో విపక్షాలు డిమాండ్ చేశాయి. నియమనిబంధనలకు లోబడి సభాపతి అనుమతించే ఎలాంటి అంశంపై అయినా చర్చించేందుకు సిద్ధమని మోదీ సర్కార్‌ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news