Ponniyin Selvan 2: పొన్నియన్‌ సెల్వన్‌ 2 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

-

డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు మణి. మొత్తం ఐదు భాగాలున్న ఈ నవలను రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక గతేడాది సెప్టెంబర్ 30న విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.

కేవలం తమిళంలోనే కాకుండా రిలీజైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.460 కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించింది. అయితే తాజాగా రెండో పార్టుకు సంబంధించిన రిలీజ్‌ డేట్‌ ఫైనల్‌ అయింది. పొన్నియన్‌ సెల్వన్‌ పార్టు-2 చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు దీనిపై అధికారికంగా ప్రకటన చేసింది. చియాన్‌ విక్రమ్‌, కార్తి, జయంరవి, త్రిష, ఐశ్వర్యరాయ్‌ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మణిరత్నం కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా తెరకెక్కించాడు.

Read more RELATED
Recommended to you

Latest news