ఇటీవల కాలంలో చాలామంది అమ్మాయిలు తమదైన శైలిలో అలరిస్తూ బాగా హైలైట్ అవుతున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటున్నారటంలో సందేహం లేదు. అలాంటి వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే బాగా పాపులర్ అయిన ఈమె వరుసగా షో ల మీద షోలు చేస్తూ.. మరొక సోషల్ మీడియాలో కూడా బాగా గ్లామర్ వలకబోస్తూ మరింత రచ్చ చేస్తుంది. కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలోనే రీతూ చౌదరి తన తండ్రిని కోల్పోయింది. మొన్నటికి మొన్న తన తండ్రిని మిస్ అవుతున్నాను.. అంటూ పోస్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తన హాట్ ఫోటోషూట్లను వీడియోలను, ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో విమర్శలు వస్తున్నాయి.
బుల్లితెరపై సత్తా చాటుతున్న రీతూ చౌదరి ఇంట్లో వారం రోజుల క్రితమే విషాదం చోటుచేసుకుంది.. తన ప్రాణానికి ప్రాణమైన తండ్రి అనారోగ్య కారణాలతో సోమవారం మరణించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ తన తండ్రితో తీసుకున్న ఒక ఫోటోను కూడా ఇన్ స్టా లో షేర్ చేసింది. అయితే సోషల్ మీడియాలో నిత్యం తనదైన రీతిలో రెచ్చిపోతున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు కూడా తన అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ గా దిగిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది . ఈ క్రమంలోని తాజాగా ఒక హాట్ వీడియోని షేర్ చేయగా అందరూ ఈమెపై ట్రోల్స్ చేస్తున్నారు.
తాజాగా బ్లాక్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీలో తీసుకున్న హాట్ వీడియోలు వదలగా … “మీ నాన్నను మొన్ననే కదా పోగొట్టుకున్నావు.. అప్పుడే ఇలాంటి వీడియోలా” అంటూ కొంతమంది ప్రశ్నిస్తూ ట్రోల్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇది ఆమె ప్రొఫెషన్ మాత్రమే అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.
View this post on Instagram