కృష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రైబ్యునల్‌ కోసం సుప్రీంకు వెళ్తాం : తెలంగాణ

-

‘కృష్ణా జలాల పంపిణీ బాధ్యతలను తేల్చే అంశం కేంద్రం పరిధిలో ఉందని.. కేంద్రమే పరిష్కరిస్తుందని ఎదురుచూస్తున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ అన్నారు. ప్రత్యేక ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జలసౌధలో ఈఎన్‌సీ మురళీధర్‌తో కలిసి డ్యాం సేఫ్టీ, క్యాడ్‌వాం తదితర ప్రాజెక్టులపై ఆయన సమీక్షించారు.

‘‘అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం-1956లోని సెక్షన్‌-3 ప్రకారం కొత్త ట్రైబ్యునల్‌ వేయడమా లేదా కేడబ్ల్యూడీటీ-2కే కృష్ణా జలాల పంపిణీ బాధ్యత అప్పగించడమా అనేది కేంద్రం తేల్చాల్సి ఉంది. రెండేళ్లుగా ఈ ప్రక్రియను పూర్తిచేయలేదు. ఇటీవల కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. నెల రోజుల్లో ప్రక్రియ చేపడతామని’ రజత్ కుమార్ చెప్పారు.

తెలంగాణకు 575 టీఎంసీలు కేటాయించాలని కోరుతున్నామని రజత్ కుమార్ అన్నారు. గోదావరి జలాల పంపిణీ కోసం కొత్తగా ట్రైబ్యునల్‌ వేయాలని ఏపీ కోరితే దానికి మేం వ్యతిరేకం కాదని.. మరోవైపు ఇప్పటివరకు ఉన్న 18 రకాల నీటిపారుదల చట్టాలన్నిటినీ ఏకీకృతం చేస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news