Telangana : అదానీ ఇష్యూ.. అసెంబ్లీలో బీఆర్​ఎస్,​ బీజేపీ మధ్య వాగ్వాదం

-

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంస్థల వ్యవహారం తెలంగాణ అసెంబ్లీకి చేరింది. ఈ వ్యవహారం, రాష్ట్రంలో ఐటీ దాడులపై కాసేపు శాసనసభలో చర్చ జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  ప్రధానమంత్రి సన్నిహితులకు చెందిన సంస్థలపై ఎలాంటి ఐటీ, ఈడీ దాడులు ఉండవని.. కష్టపడి ఎదిగిన వారిని బెదిరిస్తున్నారంటూ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు ఎదురుదాడి చేసే క్రమంలో సభలో వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు ఉద్దేశపూర్వకమైనవేనని వివేకానందగౌడ్‌ విమర్శించారు.

”రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు ఉద్దేశపూర్వకమైనవే. దేశంలో హైదరాబాద్ మినహా ఏ నగరంలోనూ అభివృద్ధి జరగడం లేదు. రాష్ట్ర అభివృద్ధి, హైదరాబాద్ ప్రగతిని అడ్డుకునేందుకే ఐటీ దాడులు చేస్తున్నారు. కేంద్రం అదానీ లాంటి వాళ్లకు లబ్ధి చేకూరుస్తోంది. గవర్నర్ ప్రసంగంలోని అంశాలు రాష్ట్ర ప్రగతికి అద్దం పడుతున్నాయి.”- ఎమ్మెల్యే వివేకానందగౌడ్

Read more RELATED
Recommended to you

Latest news