సినిమా ఛాన్స్ ల కోసం అమ్మాయిలు పడే ఆరాటంను క్యాష్ చేసుకోవడానికి చాలా మంది ఇండ్రస్టిలో గోతి కాడ నక్కలా ఎదురుచూస్తూ వుంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువుగా కొత్త నటీ నటులతో సినిమా ప్లాన్ చేస్తుంటారు. కొత్త వాళ్ల లో ఛాన్స్ కావాలని మగవాళ్ళు వస్తే హీరో ఛాన్స్ ఇస్తామని డబ్బులు వసూలు చేస్తారు. అదే అమ్మాయిలు వేస్తే డబ్బులు అడగకుండా కమిట్ మెంట్ అడుగుతారు.
చాలా మంది అమ్మాయిల తమ కెరియర్ కోసం లొంగిపోతారు. ఎందుకంటే వారు ఇల్లు విడిచి వచ్చింది దీనికోసమే అని బాధను దిగమింగుకుంటారు. అందుకే అడగగానే కమిట్ మెంట్ కు ఒకే అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు చాలా మంది డైరెక్టర్ లు టాలెంట్ ను మాత్రమే చూసి అమ్మాయిలను ఎంపిక చేస్తున్నారు.
కాని కొంత మంది దర్శకుల దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లు మాత్రం అవకాశం పేరు చెప్పి అమ్మాయిలను వ్యభిచారం రొంపిలోకి లాగుతున్నారు. రీసెంట్ గా పెద్ద పెద్ద మాస్ సినిమాలు తీసే డైరెక్టర్ దగ్గర వుండే వారు ఈ దందా స్టార్ట్ చేశారట. వారిలో ఒకరు కోనసీమ జిల్లా కు చెందిన వారు కాగా మరొకరు ఖమ్మం జిల్లా కు చెందిన వాడట. వీరి చేతిలో దాదాపు 500 పైగా అమ్మాయిలు మోసపోయినట్లగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ జైల్లో వూచలు లెక్కపెడుతున్నారు.