మహిళల కోసం ”మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్” స్కీమ్.. రూ.32 వేలు వస్తాయి.. అర్హత మొదలైన వివరాలివే..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చక్కటి లాభాలని మనం పొందొచ్చు. కేంద్రం మహిళల కోసం కూడా వివిధ పథకాల్ని తీసుకు వచ్చింది. తాజాగా మహిళల కోసం కేంద్రం ఓ స్కీమ్ ని తీసుకు వచ్చింది. ఇందుమేరకు బడ్జెట్ 2023-24లో కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. ఈ పథకం పేరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్. మరి ఇక పూర్తి వివరాలని చూసేద్దాం.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ స్కీమ్ ఎప్పుడు వచ్చింది..?

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ని పురస్కరించుకొని మోదీ సర్కార్ ఈ స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అనగా ఏప్రిల్ 1 నుంచి ఇది అమలు లో ఉంటుంది.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ స్కీమ్ లో ఎంత డబ్బులు పెట్టాలి..?

ఈ స్కీమ్ లో మహిళలు రూ.2 లక్షల వరకు డబ్బులు దాచుకోవచ్చు.
ఈ స్కీమ్ టెన్యూర్ రెండేళ్లు.
7.5 శాతం వడ్డీ ఈ స్కీమ్ తో వస్తుంది.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ స్కీమ్ బెనిఫిట్స్:

ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టి మహిళలు పాక్షిక విత్‌డ్రాయెల్ ఫెసిలిటీ ని పొందవచ్చు.
ప్రభుత్వం ఈ స్కీమ్‌ బెనిఫిట్స్ ని ఇంకా పూర్తిగా చెప్పలేదు. అవి తెలియాల్సి వుంది.
పోస్టాఫీస్‌లో ఇది అందుబాటులో ఉండచ్చు.
అలానే ఈ స్కీమ్‌పై పన్ను ఉంటుందా లేదా అనేది కూడా తెలీదు.
బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్‌లోని మిగిలిన స్కీమ్స్ తో పోల్చి చూస్తే ఈ స్కీమ్ లో వడ్డీ రేటు ఆకర్షణీయంగానే ఉందని చెప్పవచ్చు.

ఈ స్కీమ్ కింద ఎంత వస్తుంది..?

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ కింద 7.5 శాతం వడ్డీ వస్తోంది. ఇందులో మీరు రూ. 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ. 15,427 వస్తాయి. రెండేళ్లకు రూ. 32,044 వస్తాయి. అంటే రూ. 2 లక్షల ఇందులో పెడితే మీకు రూ. 32 వేలకు పైగా వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news