బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీ తో రాణించాడు. రోహిత్ శర్మ 171 బంతుల్లో 14 ఫోర్లు మరియు రెండు సిక్సర్ల సహాయంతో సెంచరీ బాదేశాడు. దీంతో టెస్టుల్లో రోహిత్ శర్మ 9వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఒకవైపు అందరూ ఔటు అవుతున్నా… ఓపెనింగ్ లో వచ్చిన రోహిత్ శర్మ ఒక్కడే..ఆసీస్ బౌలర్లను తట్టుకొని నిలబడ్డాడు. ఈ తరుణంలోనే రోహిత్ శర్మ అద్భుతమైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ గా టి20, వన్డే మరియు టెస్టుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు లోకి ఎక్కాడు. కాదా ప్రస్తుతం టీమిండియా స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 176 గా ఉంది. పూజార ఏడు పరుగులు, కోహ్లీ 12 పరుగులు మరియు సూర్యకుమార్ యాదవ్ ఎనిమిది పరుగులతో విఫలమయ్యారు.
Smiles, claps & appreciation all around! 😊 👏
This has been a fine knock! 👍 👍
Take a bow, captain @ImRo45 🙌🙌
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/gW0NfRQvLY
— BCCI (@BCCI) February 10, 2023