రామోజీ ఫిల్మ్ సిటీ వరకు మెట్రో పొడిగింపుపై ఆలోచిస్తామని అసెంబ్లీలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. మెట్రో రైలును ఎల్బీనగర్ నుండి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు, ఎల్బి నగర్, నాగోల్ నుండి Airport వరకు విస్తరించాలని..ఎమ్మెల్సి యెగ్గే మల్లేశం అడిగారు. దానికి సమాధానం ఇచ్చారు కేటీఆర్. హైదరాబాద్ మెట్రో 69 కిలోమీటర్లు ఉందని.. గత మెట్రో మొత్తం ppp తో నడిచిందని తెలిపారు.
ఇప్పుడు రహేజ ఐటీ పార్కు నుండి శంషాబాద్ Airport వరకు మెట్రో రైలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని.. ఇది రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్న ప్రాజెక్ట్ అన్నారు.
చాలా మంది కరోనా తర్వాత రవాణా కష్టాలు పడ్డారని… Air port మెట్రోలో ఎవరైనా ప్రయాణం చేయొచ్చన్నారు. లక్డికపూల్ నుంచి bhel వరకు మెట్రో మూడో దశ కూడా త్వరలో చేపడతామని.. ఓల్డ్ సిటీకి మెట్రోకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించామని వెల్లడించారు. కేంద్రం కనీసం తెలంగాణ పై కనికరం చూపెట్టడం లేదని మండిపడ్డారు మంత్రి కేటీఆర్.