కాజీపేట-బల్లార్షా రైల్వే లైన్ పనుల ఎఫెక్ట్.. తాత్కాలికంగా 17 రైళ్ల రద్దు

-

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట- బల్లార్ష సెక్షన్‌ మూడో రైల్వేలైను నాన్‌- ఇంటర్‌లాకింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. దీని ప్రభావం ఇతర రైళ్ల రాకపోకల మీదపడింది. దీంతో తాత్కాలికంగా 17 రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరో ఏడు రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. ఈ నెల 25వ తేదీ వరకు ఈ ప్రభావం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్‌- బల్లార్ష పరిధిలోని పలు ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లను ద.మ.రైల్వే రద్దు చేసింది. ఇందులో కొన్ని రైళ్లు 15-24 వరకు, మరికొన్ని 16-25 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు.

కాజీపేట- బల్లార్ష (17035), బల్లార్ష- కాజీపేట (17036), సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (12757), సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ (12758), హెచ్‌ఎస్‌ నాందేడ్‌-నిజామాబాద్‌ (07854), నిజామాబాద్‌-హెచ్‌ఎస్‌ నాందేడ్‌ (07853), కాచిగూడ-కరీంనగర్‌ (07793), కరీంనగర్‌-కాచిగూడ (07794), పూర్ణ-ఆదిలాబాద్‌ (07776), కాచిగూడ-నిజామాబాద్‌ (07596), నిజామాబాద్‌-కాచిగూడ (07593), కాజీపేట-సిర్పూర్‌(టి) (17003), బల్లార్ష-కాజీపేట (17004), సిర్పూర్‌(టి)-కరీంనగర్‌ (07766), కరీంనగర్‌-సిర్పూర్‌(టి) (07765), కరీంనగర్‌-నిజామాబాద్‌ (07894), నిజామాబాద్‌-కరీంనగర్‌ (07893) ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news