శ్రీలంక బ్యూటీని పెళ్లి చేసుకోనున్న హీరో శింబూ !

-

తమిళ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. కేవలం కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా అభిమానులను సంపాదించుకున్న ఈయన వల్లభ, మన్మధ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు శింబు…ఇదివరకు ఎన్నోసార్లు ప్రేమలో పడ్డారంటూ వార్తలు వచ్చాయి.

ఈ విధంగా ఈ హీరో ఇదివరకే నయనతార, హన్సిక వంటి సెలబ్రిటీలతో ప్రేమలో పడి వారితో బ్రేకప్ చెప్పుకొని వార్తలలో నిలిచారు. అయితే తాజాగా ఈయన మరొక అమ్మాయితో ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీరి ప్రేమ విషయం ఇప్పటికే ఇరు కుటుంబసభ్యులకు తెలియడంతో వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం శింబు శ్రీలంకకు చెందిన ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఆ అమ్మాయి డాక్టర్ చదువుతుందని, తన తండ్రి పెద్ద బిజినెస్మేన్ అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news