మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపి అధికార ప్రతినిధి శ్యామల. ఇవాళ మీడియాతో వైసీపి అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ… చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారన్నారు. చేతగానప్పుడు, చేయలేనప్పుడు శుష్కవాగ్ధానాలు చేయకూడదని తెలిపారు. సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారని ఆగ్రహించారు.2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారని ఫైర్ అయ్యారు.
నమ్ముతున్నారని మహిళలను సులువుగా మోసం చేస్తున్నారని ఆగ్రహించారు. తల్లికి వందనం పేరుతో జగన్ ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని ఆపేశారని సీరియస్ అయ్యారు. లక్షలాది మంది తల్లులు, విద్యార్ధులు అమ్మఒడి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ 15 వేలు చొప్పున ఇస్తామన్నారు..రాసి పెట్టుకోమని కూడా చెప్పారని తెలిపారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారు..హామీలు మాత్రం జనంలో ఇచ్చారని నిప్పులు చెరిగారు. ఇవ్వలేకపోతున్నామని నాలుగు గోడల మధ్య చెప్తున్నారు..తల్లికి వందనం ఇవ్వట్లేదని టీడీపీ నేతలు జనంలోకి వచ్చి చెప్పాలన్నారు. దీపం పథకం కింద ఇవ్వాల్సిన 4,115 కోట్లు ఎగ్గొట్టారని ఆరోపణలు చేశారు.