కల్వకుంట్ల కవిత ఒక మంచి అడుగు వేశారు – ఏచూరి

-

 

కవిత దీక్షలో పాల్గొన్న సిపిఎం సీతారాం ఏచూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత ఒక మంచి అడుగు వేశారని తెలిపారు. మహిళ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు వామపక్ష పార్టీల మద్దతు ఉంటుందని వెల్లడించారు సిపిఎం సీతారాం ఏచూరి. మహిళలకు భాగస్వామ్యం లేనంత వరకు సమాజం ముందుకు పోదన్నారు.రాజ్యసభలో గతం లో ఆమోదం పొందింది…కానీ లోక సభలో జరుగలేదని పేర్కొన్నారు సిపిఎం సీతారాం ఏచూరి.

వచ్చే పార్లమెంట్ సమావేశాలు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలన్నారు. మహిళా రిజర్వేషన్ మోడీ హామీ ఇచ్చారని వివరించారు. తొమ్మిదేళ్లు పూర్తయింది… ఇప్పటివరకు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టలేదని… ఈ పార్లమెంట్లో సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని పట్టుబడతాయన్నారు సిపిఎం సీతారాం ఏచూరి.

Read more RELATED
Recommended to you

Latest news