TSPSC ఘటనతో కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని విమర్శలు చేశారు వైఎస్ షర్మిల. నిరుద్యోగుల పక్షాన శాంతియుతంగా పోరాడుతుంటే హౌజ్ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. TSPSC అక్రమాలపై CBI దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. ఎనిమిదేండ్లుగా బయటపడని అక్రమాలను కూడా తేల్చాలన్నారు. ఈ కుంభకోణంలో ఉద్యోగులతో పాటు బోర్డు సభ్యులు, మంత్రుల హస్తం కూడా ఉందని వెల్లడించారు.
TSPSC నిరుద్యోగుల విశ్వసనీయత కోల్పోయింది. సొంతూరును వదిలి, పట్టణాల బాటపట్టి.. కోచింగులు, పుస్తకాల కోసం అప్పులు చేసి.. రాత్రనకా, పగలనకా నిరుద్యోగులు కష్టపడుతుంటే.. అంగట్లో సరుకులా ప్రశ్నాపత్రాలు అమ్ముకోవడం సిగ్గుచేటు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి. కేసీఆర్ కు కవిత కేసుల మీద ఉన్న సోయి TSPSC మీద లేదని నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల.