ఏకశిలా నిర్మాణం కైలాస దేవాలయం.. అద్భుత ర‌హ‌స్యాలు..

-

కైలాష్ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్నది. గుహ అంటే ఈ టెంపుల్ బయటకు కనపడదని కాదు. నిక్షేపంగా కనిపిస్తుంది.ఇది ఇటుకలతోనో, పెద్దపెద్ద రాళ్ళు పేర్చో కట్టిన కట్టడం కాదు. అత్యంత ఆశ్చర్యం, సంక్లిష్టత కలిగిన ఈ మచ్చలేని ఏకశిలా ఆలయాన్ని క్రీశ 8 శతాబ్దం( 756-773)లో రాష్ట్ర‌కూటులు నిర్మించారు. అంత పెద్ద మొత్తంలో రాయిని చెక్కి ఒక రూపు తీసుకురావాలంటే అప్పటిరోజులనుబట్టి కనీసం 200 సంలు కావాలి.

కానీ కేవలం 18సంలు మాత్ర‌మే ప‌ట్టింది. 18 ఏళ్ళపాటు నాలుగు లక్షల టన్నుల రాయిని తొలచి కైలాస్ టెంపుల్ కట్టారు. 4 లక్షల టన్నులంటే ఏడాదికి 22,222 టన్నుల రాయి. అంటే రోజుకు 60 టన్నులు. రోజులో 12గంటలపాటు పని చేసారనుకున్నా గంటకు 5 టన్నుల రాయిని పెకిలించాలి. అది కూడా అడ్డదిడ్డంగా కాదు. ఆలయానికి కావలసిన షేప్లో చెక్కుతూ అంతరాయిని తీసేయాలి. ఇప్పుడున్న అంత అత్యాధునిక మిషనరీలు వాడినా గంటలో 5 టన్నుల రాయిని పెకిలించటం అసాధ్యం.

మరి అలాంటివాళ్ళు ఇంత ఘనకార్యాన్ని ఎలా సాధించారో వారికే తెలియాలి. ఆకాశం నుంచి చూస్తే ఈ టెంపుల్ ఎక్స్ షేప్ లో ఉంటుంది. భూమి మీద నుండి చూస్తే 4 సింహాలు ఎక్స్ ఆకారంలో నిలుచున్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు ఈ ఆలయనిర్మాణంలోనే వాటర్ హార్వెస్టింగ్ సౌకర్యం ఉంది. ఎక్కడికక్కడ డ్రైనేజ్, రహస్యమార్గాలు, బాల్కానీలు, అప్‌స్టైర్స్ ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.  అన్నికూడా రాయితో చెక్కిన‌వే. ఔరంగజేబ్ అనేక హిందుఆలయాలను నాశనం చేసాడు.

ఆ క్రమంలో భాగంగా ఈ ఆలయాలను కూడా నాశనం చేయాలని వెయ్యిమందిని పంపించాడు. వారు విశ్రాంతి లేకుండా 3 సంల పాటు ఎంతో ప్రయత్నించినప్పటికీ వాళ్ళు చేసింది కేవలం కొన్ని విగ్రహాలకు గాట్ లు పెట్టడమే అంతకు మించి ఏమీ చేయలేకపోయాడు. ఏంవింతో గానీ కనీసం ఆలయంలోని గర్భ గుడిలో కూడా వెళ్ళలేకపోయాడు. మరి ఇంత అద్భుతమైన ఆలయాన్ని ఎవరు కట్టారో.ఎలా కట్టారో తెలియదు. ఆ అద్భుతం వెనకవున్న మిస్ట‌రీ ఏంటో ఇప్పటికీ అర్ధంకాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news