నిహారిక భర్త చైతన్య గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

-

నిహారిక భర్త చైతన్య జొన్నల గడ్డను గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పాలి. డైలీ కఠినమైన డైట్ ఫాలో అవుతూ ఉంటాడు. అతడికి గుర్రాలు అంటే కూడా చాలా ఇష్టం.. వాటితో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు.. నిహారికను వివాహం చేసుకోక ముందు ఇతడు ఎవరో కూడా తెలియదు. కానీ మెగా ఇంటికి అల్లుడుగా వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ఎంతో గ్రాండ్గా చైతన్య నిహారికల వివాహ వేడుక జరిగింది.

ఇదిలా ఉండగా త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ఇద్దరు కూడా ఒకరికొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడమే కాదు ఫోటోలను కూడా డిలీట్ చేసుకున్నారు. దీంతో వీరిద్దరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీ టాపిక్ గా మారిపోయారు. ఇకపోతే నిహారిక గురించి మనకు అన్ని విషయాలు తెలుసు… మరి చైతన్య జొన్నలగడ్డకు సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..

చైతన్య హైదరాబాదులోని భారతీయ విద్యా భవన్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేసి తర్వాత రాజస్థాన్లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి గణితంలో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాదులోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేసిన ఈయన కాలేజ్ డేస్ లో స్టూడెంట్స్ యూనియన్ లీడర్ గా పనిచేసేవాడు . బలమైన నాయకత్వం నైపుణ్యాలను ప్రదర్శించేవాడు. చదువు పూర్తయిన వెంటనే వివిధ సంస్థల్లో ఇంటర్షిప్ చేసి వ్యాపారంలో కూడా మంచి అనుభవం సంపాదించాడు. ఇక ఈయన తండ్రి ప్రభాకర్ రావు. గుంటూరులో ప్రస్తుతం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్నారు. ఈయన తాత వెంకటేశ్వర్లు కూడా ఇన్స్పెక్టర్.. చైతన్య తల్లి గృహిణి.. అయితే అతనికి ఒక అక్క ఉంది ..ఆమె పేరు దీపిక. ప్రస్తుతం భర్తతో కలిసి యుఎస్ఏ లో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news