సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దురదృష్టకరమైన ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ను కేసీఆర్ గారి సూచనతో పరామర్శించాం. శ్రీతేజ్ కోలుకుంటున్నాడు వైద్యానికి శ్రీతేజ్ స్పందిస్తున్నారు. శ్రీతేజ్ కు స్పర్శ కూడా మెరుగైందని డాక్టర్లు చెబుతున్నారు. భగవంతుడి దీవెనలతో శ్రీ తేజ్ కోలుకుని మళ్ళీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నాం. తొక్కిసలాట లో మరణించిన రేవతి కి మా ప్రగాఢ సానుభూతి. తాను మరణిస్తున్నా కొడుకు శ్రీ తేజ్ ను రక్షించుకోవడానికి రేవతి పడ్డ తపన మనం చూశాం.
అయితే ఇక్కడ రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు. ప్రతిపక్షాల పై సీఎం రేవంత్ నెపాన్ని నెడుతున్నపుడు రాజకీయాలు మాట్లాడలేక ఉండని పరిస్థితి. సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం, మంత్రులు స్పందించారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను రేవంత్ రెడ్డి ,ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించలేదు. గురుకులాల పిల్లల మాతృ మూర్తుల శోకాన్ని సీఎం ఎందుకు గుర్తించరు. చట్టం అందరికీ సమానమే అంటున్న సీఎం రెవంత్ కొండారెడ్డి పల్లి లో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య కు కారణమైన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు. సాయిరెడ్డి రాసిన ఆత్మహత్య లేఖలో ఉన్న తన సోదరులపై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోరు.. రేవంత్ రెడ్డి సోదరులను కనీసం పోలీస్ స్టేషన్ కు కూడా పిలవరా అని ప్రశ్నించారు ఆయన.