AI వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేయండి.. ఎలాన్ మస్క్‌ సహా 1000 మంది నిపుణుల బహిరంగ లేఖ

-

టెక్ వర్గాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంత ఇంట్రెస్టింగ్​గా అనిపిస్తుందో.. అంతకు మించి ఆందోళన కలిగిస్తోంది. ఏఐ వల్ల భవిష్యత్​లో ఉద్యోగాలు పోవడంతో పాటు మానవాలికే ముప్పు కలగనుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ వంటి టెక్ నిపుణులు కూడా ఇదే విషయాన్ని బల్లగుద్ది చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోన్న విషయం.

అత్యాధునిక ఏఐ వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని కోరుతూ ఎలాన్ మస్క్ సహా వేయి మంది టెక్ నిపుణులు బహిరంగ లేఖ రాసి సంతకం చేశారు. ఇందులో యాపిల్‌ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్‌ వోజ్నియాక్‌ వంటి నిపుణులు కూడా ఉన్నారు. ‘పాజ్‌ జియాంట్‌ ఏఐ ఎక్స్‌పెరిమెంట్స్‌’ పేరిట ఈ లేఖను విడుదల చేశారు. ఈ లేఖను ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ తరఫున విడుదల చేశారు.

మానవ మేధస్సుతో పోటీ పడే జీపీటీ-4 వంటి ఏఐ వ్యవస్థలు సమాజానికి, యావత్‌ మానవాళికి తీవ్ర ముప్పును తలపెట్టే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. సానుకూల ఫలితాలు ఇవ్వగలిగే ఏఐ వ్యవస్థలను మాత్రమే అభివృద్ధి చేయాలని సూచించారు. ఒకవేళ ఏమైనా ప్రతికూల ప్రభావాలు తలెత్తినా.. వాటిని నియంత్రించగలమనే నమ్మకం కుదిరితేనే శక్తిమంతమైన ఏఐల దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news