అంతర్జాతీయ వేదికపై ‘బలగం’ హవా.. రెండు ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం

-

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రేక్షకుడిని కదిలించినా బలగం సినిమా గురించే మాట్లడుకుంటున్నారు. చిన్న సినిమాలుగా విడుదలై సంచలనం సృష్టించిన సినిమాలు ఈ మధ్య బాగా వస్తున్నాయి. అలా ఓ మాములు సినిమాగా రిలీజ్ అయిన మరో చిత్రమే బలగం. పల్లెటూరు పచ్చదనం, తెలంగాణ సంస్కృతి, ఆచారాలను మనుషుల మధ్య ఉండే సంబంధాలను ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించారు. కమెడియన్​​ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన తొలి చిత్రమిది. తన అద్భుత పనితీరుతో ఆడియెన్స్​ను కంటతడి పెట్టించారు.

తాజాగా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో హవా చాటింది. లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డులను ముద్దాడింది. బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిమ్​, బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిమ్​ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో రెండు అవార్డులు అందుకుంది. ఈ మేరకు.. లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ నిర్వాహకులు.. సర్టిఫికెట్స్‌ను కూడా జారీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను దర్శకుడు వేణు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి హర్షం వ్యక్తం చేశాడు.

‘నా బలగం చిత్రానికి మూడో అవార్డు. అంతర్జాతీయ స్థాయిలో నా బలగం గుర్తింపు తెచ్చుకుంటోంది’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ అవార్డు అందుకున్న వేణుకు అందరూ సోషల్​మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news