ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. ఏమేమి మారాయో చూసేద్దాం..!

-

ప్రతీ నెలా కూడా కొత్త రూల్స్ వస్తూ ఉంటాయి. అలానే ఈసారి కూడా కొన్ని కొత్త రూల్స్ రానున్నాయి. అందులోను ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చేస్తోంది. దీనితో కొన్ని అంశాల్లో మార్పులు రాబోతున్నాయి. పూర్తి వివరాలని ఇప్పుడు చూసేద్దాం.

ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను శ్లాబ్స్‌లో మార్పులు రానున్నాయి. కొత్త పన్ను విధానంలో శ్లాబ్స్ మారిన విషయం తెలిసిందే. కొత్త పన్ను విధానంలో రిబేట్ లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు.
అలానే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారు దీన్ని తప్పక తెలుసుకోవాలి. ఈక్విటీల్లో 35 శాతం కన్నా తక్కువ ఇన్వెస్ట్ చేసే డెట్ మ్యూచువల్ ఫండ్స్ క్యాపిటల్ గెయిన్స్‌ను మీ ఆదాయంలో కలిపి ట్యాక్స్ ని వసూలు చేస్తారు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము గరిష్ట పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా 8 శాతం వడ్డీ లభిస్తోంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లిమిట్‌ను 4.5 లక్షల నుంచి రూ.9 లక్షలు కి మార్చారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రెపో రేట్‌ను పెంచే అవకాశం ఉంది. ఏప్రిల్ 6న ఈ నిర్ణయం రాబోతోంది.
ఏప్రిల్ 1 నుంచి హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉన్న హాల్‌మార్క్ బంగారు నగల్నే అమ్మనున్నాయి. నగలపై హాల్‌మార్క్ వేసేప్పుడు కోడ్ ఉంటుంది.
యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్, సాలరీ అకౌంట్లకు కొత్త టారిఫ్‌ను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనుంది. రూ.75,000 గా ఉన్న యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news