ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఓ బొలెరో వాహనం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమంయంలో వాహనంలో 11 మంది ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్సుగూడ జిల్లాలోని లఖన్పుర్ పరిధిలోని బదాధార గ్రామానికి చెందిన 11 మంది.. సంబల్పుర్లోని పరమన్పుర్లో జరిగిన ఓ పెళ్లికి వెళ్లారు. అనంతరం నిన్న అర్ధరాత్రి ఒంటిగంటకు తిరుగు ప్రయాణమయ్యారు. సంబల్పుర్ జిల్లా ససన్ కాలువ వద్దకు రాగానే.. వాహనం అదుపుతప్పి కెనాల్లో పడిపోయింది. ఆ సమయంలో నలుగురు బయటపడగా.. మిగతా ఏడుగురు బయటకు రాలేక ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులను అజిత్ ఖమారి, దివ్య లోహా, సుబల్ భోయ్, సుమంత్ భోయ్, సరోజ్ సేథ్, రమాకాంత్ భోయ్, బొలెరో డ్రైవర్ శతృఘ్న భోయ్‌గా గుర్తించారు