తమిళనాడు, కర్ణాటకలో ‘పెరుగు’ వివాదం.. దిగొచ్చిన కేంద్రం.. ‘దహీ’ నిర్ణయం వెనక్కి

-

తమిళనాడులో పెరుగు వివాదం సంచలనం రేకెత్తించింది. ఆ రాష్ట్రంలో పెరుగు ప్యాకెట్లపై పేరును హిందీలోకి మార్చడంపై తీవ్ర దుమారం రేగింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ సహా పలువురు నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ- ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇటీవల తమిళనాడు మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌కు పెరుగు పేరుపై కొన్ని ఆదేశాలు జారీ చేసింది. పెరుగు ప్యాకెట్లపై ఆంగ్లంలో ఉన్న కర్డ్​, తమిళంలో ఉన్న ‘తయిర్‌’ పేర్లను తొలగించి.. ‘దహీ’ అని హిందీలోకి మార్చాలని చెప్పేలా ఉత్తర్వులు వెలువరించింది.

పెరుగుతోపాటు నెయ్యి, చీజ్‌ వంటి డైరీ ఉత్పత్తుల పేర్లను కూడా.. ఇలాగే మార్చాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది. కర్ణాటకకు కూడా ఇలాంటి ఉత్తర్వులే పంపినట్లు తెలిసింది. ఈ ఆదేశాలపై కర్ణాటక, తమిళనాట తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆ నిర్ణయాన్ని వెనక్కుతీసుకుంటున్నట్లు వెల్లడించింది. పెరుగు పేరు మార్పుపై జారీ చేసిన ఆదేశాలను సవరించింది. పెరుగు ప్యాకెట్లపై ఆంగ్ల పేరుతో పాటు.. స్థానిక భాషల పేర్లను బ్రాకెట్లలో పెట్టుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news