సినిమాటోగ్రాఫర్ గా మారిన అనుపమ.. టాలెంట్ కి ఫ్యాన్స్ ఫిదా..!

-

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆచితూచి అడుగులు వేస్తూ తన పాత్రకు తగ్గట్టుగా కథలను సెలెక్ట్ చేసుకుంటూ.. సక్సెస్ఫుల్ ట్రాక్ లో దూసుకుపోతోంది. ముఖ్యంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్న అనుపమ ఇటీవల తన ఖాతాలో వరుసగా రెండు హిట్స్ వేసుకుంది. ఇక తాజాగా ఈమె నటించిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవ్వగా.. మరొకవైపు 18 పేజీస్ సినిమా కూడా నిఖిల్ తో నటించి మంచి హిట్ సొంతం చేసుకుంది.

అలాగే బటర్ ఫ్లై అనే సినిమాలో కూడా నటించిన ఈమె నటిగానే కాకుండా తనలో ఒక మంచి ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ కూడా ఉన్నారు అంటూ ప్రూవ్ చేసుకుంది. సంకల్ప్ గోరా దర్శకత్వంలో వచ్చిన “ఐ మిస్ యు ” అనే షార్ట్ ఫిలిం తో ఈమె ఇలా సినిమాటోగ్రాఫర్ గా మారి అందరిని అబ్బురపరిచింది. ప్రస్తుతం ఈ షార్ట్ ఫిలిం యూట్యూబ్ ఛానల్ చాయ్ బిస్కెట్ లో మనకు అందుబాటులో ఉంది. ఈ షార్ట్ ఫిలింలో అనుపమ కెమెరా వర్క్ కి విపరీతమైన స్పందన లభిస్తోంది. యుఎస్ లో నివసిస్తున్న ఒక యువకుడు తన తల్లిదండ్రులతో అతని సంబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మొత్తానికి అయితే ఈ షార్ట్ ఫిలిం కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇకపోతే మంచి ఆఫర్స్.. వరుస హిట్స్ కూడా ఉన్న ఒక హీరోయిన్ ఇలా ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడం సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇదే మొదటిసారి.. ఏది ఏమైనా ఈమె టాలెంట్ కి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news