జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు పెను ప్రమాదం తప్పింది. ఓ సమావేశంలో పాల్గొన్ని కిషిద తన ప్రసంగాన్ని మొదలు పెట్టడానికి కొన్ని క్షణాల ముందే భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో అప్రమత్తమైన ఆ దేశ అధికారులు వెంటనే ప్రధాన మంత్రిని అక్కడి నుంచి సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించారు.
వకయామా సిటీలో ప్రధాని కిషిదా ఓ మీటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఆయన ప్రసంగం స్టార్ట్ చేయడానికి కొన్ని సెకన్ల ముందే భారీ పేలుడు సంభవించింది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రధానని అక్కడి నుంచి వేరే సురక్షిత ప్రాంతానికి తరలించారు. బాంబు పేలుడుతో ఒక్కసారిగా అక్కడున్న జనం ఉలిక్కిపడ్డారు. భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. బాంబు దాడిలో కిషదాకు ఎలాంటి గాయాలు జరగలేదని అధికారులు తెలిపారు. స్మోక్ లేదా పైప్ బాంబును విసిరి ఉంటారని అనుమానిస్తున్నారు.
లిబరల్ డెమోక్రటిక్ పార్టీ వ్యక్తితో కిషిదా మాట్లాడుతున్న సమయంలో బాంబు పేలుడు ఘటన జరిగింది. స్మోక్ బాంబుతో అటాక్ చేసిన వ్యక్తిని పట్టుకున్నట్లు స్థానిక మీడియా చెబుతోంది. గత ఏడాది జులై 22వ తేదీన మాజీ ప్రధాని షింజో అబేను తుపాకీతో ఓ వ్యక్తి కాల్చి చంపిన విషయం తెలిసిందే.