ఐపీఎల్ చరిత్రలో సచిన్ టెండూల్కర్-అర్జున్ టెండూల్కర్ హిస్టరీ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు బ్రదర్స్ ఐపీఎల్లో ఆడటం చూశాం. కానీ మొట్టమొదటి సారిగా తండ్రీకుమారులిద్దరూ ఓ లీగ్‌లో ఆడటం ఇదే తొలిసారి. కోల్‌కతాపై అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్‌కు కెప్టెన్ సూర్యకుమార్ తొలి ఓవర్‌నే బంతినిచ్చాడు. రెండు ఓవర్లు వేసిన అర్జున్ వికెట్ లేకుండా17 పరుగులు ఇచ్చాడు. ముంబయి రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ చేతుల మీదుగా క్యాప్‌ను అందుకున్న అర్జున్ను ఉద్దేశించి సచిన్ ట్విటర్లో ఓ స్పెషల్ మెసేజ్ చేశారు.
‘‘క్రికెటర్‌గా ప్రయాణంలో ఇవాళ నువ్వు మరో కీలకమైన ముందడుగు వేశావు. తండ్రిగా, క్రికెట్ ప్రేమికుడిగా ఎంతో ఆనందిస్తున్నా. ఆటకు నువ్వు గౌరవం తీసుకొచ్చేలా ఆడతావమని నాకు తెలుసు. గేమ్ కూడా నీకు ప్రేమను అందిస్తుందనే నమ్మకం నాకుంది. ఇక్కడికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డావు. ఇదే శ్రమను కొనసాగించు. అద్భుతమైన ప్రయాణానికి ఇది ఆరంభం. ఆల్ ది బెస్ట్’’’ అని అర్జున్ను ఉద్దేశించి సచిన్ ట్వీట్ చేశాడు.
Arjun, today you have taken another important step in your journey as a cricketer. As your father, someone who loves you and is passionate about the game, I know you will continue to give the game the respect it deserves and the game will love you back. (1/2) pic.twitter.com/a0SVVW7EhT
— Sachin Tendulkar (@sachin_rt) April 16, 2023