ఎన్టీఆర్ మరణనానికి కారణం చంద్రబాబే అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హజరయ్యే హక్కు చంద్రబాబు కు లేదు…ఎన్టీఆర్ మరణనానికి కారణం కూడా చంద్రబాబేనని ఫైర్ అయ్యారు.
ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి గద్దే దించాడు..ఎన్టీఆర్ చివరి రోజుల్లో ప్రసగం లో చంద్రబాబు ఔరంగజేబుతో పోల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను తురక గంగమ్మ కుటుంబానికి అన్యాయం చేసానని ఆరోపణలు చేశాడని.. తురక అనిల్ తో పాటు మరో ఇద్దరు చనిపోయారని పేర్కొన్నారు. నా మీద కక్ష్య తప్ప, బాధితుల మీద ప్రేమలేదన్నారు. చంద్రబాబు కు బాధితుల మీద ప్రేమ ఉంటే ప్రమాదం లో చనిపోయిన మిగిలిన కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని కోరారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు.