America : అయ్యో పాపం.. చిన్నారి ప్రశ్నకు ఇబ్బంది పడ్డ జో బైడెన్‌

-

అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ మరోసారి ఇరుకున పడ్డారు. అయితే ఈసారి మీడియానో.. ప్రతిపక్షాలో.. ఇతర దేశాల నేతలో బైడెన్​ను ఇబ్బంది పెట్టలేదు. ఓ బుడ్డోడు ఈ అగ్రరాజ్యాధినేతను ఇరకాటంలో పడేశాడు. మరీ అంతగా ఇబ్బంది పెట్టే ప్రశ్నేం అడగలేదనుకోండి. కాకపోతే బైడెన్ దానికి సమాధానం మరిచిపోయారు. ఇంతకీ ఆ ప్రశ్నేంటంటే..?

‘టాక్‌ యువర్‌ చైల్డ్‌ టు వర్క్‌ డే’ కార్యక్రమంలో భాగంగా శ్వేతసౌధంలో బైడెన్‌ చిన్నారులతో సమావేశమయ్యారు. బైడెన్‌ చుట్టూ ప్రజలు, చిన్నారులు ఉన్నారు. ఓ చిన్నారి మీరు ఇటీవల ఏ దేశంలో పర్యటించారు అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి బైడెన్‌ చాలా ఇబ్బందిపడ్డారు.

‘‘నేను ఇటీవల పర్యటించిన దేశం ఏదంటే..నేను ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఇప్పటివరకు 89 మంది దేశాధినేతలను కలిశాను. చివరిగా ఎక్కడ పర్యటించానో చెప్పడం కష్టంగా ఉంది’’ అని తెలిపారు. వెంటనే మరో చిన్నారి ఐర్లాండ్‌ అని గుర్తు చేసింది. దానికి బైడెన్‌.. ‘‘అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. నీకు ఎలా తెలుసు’’ అని అన్నారు. చిన్నారుల నుంచి ఆయన చాలా ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఆయన ఎందుకు అమెరికా అధ్యక్షుడు కావాలనుకున్నారో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news