నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. టాలీవుడ్ హీరో బెల్లంకొడ శ్రీనివాస్ రిలేషన్షిప్లో ఉన్నారని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ తరచూ విమానాశ్రయంలో కలిసి కనిపిస్తుండటంతో ఈ వార్త జోరందుకుంది. అయితే తాజాగా ఈ రూమర్‌పై బెల్లంకొండ స్పందించాడు. హిందీ చిత్రం ‘ఛత్రపతి’ ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బెల్లంకొండ.. ఈ డేటింగ్ వార్తల గురించి మాట్లాడాడు.
‘‘మేమిద్దరం ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేనూ రష్మిక మంచి స్నేహితులం. మేమిద్దరం హైదరాబాద్‌కు చెందిన వాళ్లం కావడంతో షూటింగ్ పనుల మీద తరచూ ముంబయికి వెళ్తుంటాం. అలా వెళ్లేటప్పుడు ఎయిర్‌పోర్టులో కలుసుకుంటాం. అలా అనుకోకుండా కలుసుకున్న సందర్భాలు చాల తక్కువ. అంత మాత్రానికే ఇలాంటి వార్తలు రాసేస్తారా..? ఈ వార్తలన్నీ రూమర్స్ మాత్రమే’’ అని అన్నాడు.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ చిత్రం ‘ఛత్రపతి’లో నటిస్తున్నాడు. వి.వి వినాయక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో శ్రీనివాస్ సరసన నుస్రత్ భరుచా నటిస్తోంది. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.