ప్రపంచ బ్యాంక్ నూతన అధ్యక్షుడిగా అజయ్ బంగా నియమితులయ్యారు. ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించనున్న భారత సంతతికి చెందిన తొలి ఇండో అమెరికన్‌గా నిలిచారు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఆయన ఈ ఏడాది జూన్ 2 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నట్లు వరల్డ్ బ్యాంక్ ధ్రువీకరించింది. ఈ పదవిలో ఆయన 5 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బోర్డు సభ్యులందరూ ఆమోదించిన అనంతరం వరల్డ్ బ్యాంక్ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. అంతకుముందు ఫిబ్రవరిలోనే 63 ఏళ్ల బంగాను వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
189 దేశాలకు సభ్యత్వం ఉన్న ప్రపంచ బ్యాంక్‌లో ముఖ్యమైన విభాగాలన్నింటికీ భారతీయులే నేతృత్వం వహిస్తున్నారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా అన్షులా కాంత్, చీఫ్ ఎకానమిస్ట్‌గా ఇందర్మిత్ గిల్, చీఫ్ రిస్క్ ఆఫీసర్‌గా లక్ష్మీ శ్యామ్ సుందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పరమేశ్వరన్ అయ్యర్ కొనసాగుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా వెళ్తుండటం, అభివృద్ధి చెందిన దేశాలు సైతం కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ బంగా ఈ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.