కూల్ అవ్వాలంటే కోహ్లీ-గంభీర్‌ ఈ యాడ్‌లో నటించాలి : యువరాజ్‌ సూచన

-

విరాట్‌ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్‌ల మధ్య చెలరేగిన తీవ్ర వాగ్వాదంపై చర్చ ఇప్పట్లో ముగిసేట్లు లేదు. ఈ వ్యవహారంపై నెట్టింట్లో తెగ రచ్చ జరుగుతోంది. రీల్స్, మీమ్స్​తో తెగ హల్​చల్ చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై మాజీ ఆటగాళ్లు స్పందిస్తూనే ఉన్నారు. మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ స్పందించాడు. వారిద్దరి మధ్య కోపం తగ్గేలా ఓ సరదా సూచన చేశాడు.

వీరిద్దరి మధ్య వ్యవహారం చల్లగా ఉండాలంటే.. కోహ్లీ, గంభీర్‌ ఓ శీతల పానీయం యాడ్‌కు సంతకం చేయాలని సూచించాడు. ‘యాడ్‌ ప్రమోషన్‌ కోసం గంభీర్‌, కోహ్లీల నుంచి సాఫ్ట్‌ డ్రింక్‌ సంతకం తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. వారిని ఇది చల్లగా ఉంచుతుంది.. మీరేమంటారు?’ అంటూ యువీ ఫన్నీ ట్వీట్‌ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది.

ఇటీవల లక్నో, బెంగళూరు మ్యాచ్‌ అనంతరం.. విరాట్‌, గంభీర్‌ కోపోద్రిక్తులై ఒకరిపై ఒకరు దూసుకెళ్లేంత పని చేశారు. వారిని ఇతర ఆటగాళ్లు వారించి, విడదీసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news