సంగారెడ్డి జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. చెల్లి పెళ్లికి చేసిన అప్పులు తీర్చేందుకు దొంగతనాలు చేస్తూ దొరికిపోయాడు ఓ అన్న. గత నెల 26న రామచంద్రాపురంలో ఉండే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విష్ణు తేజ ఇంట్లో చోరీ జరిగింది. ఐదు లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు విలువైన వాచ్ లు, 15 వేల రూపాయలు ఎత్తుకెళ్లాడు ఈ దొంగ అన్న.
కిటికీల గ్రిల్ తొలగించి దొంగతనం చేయడంతో ఎవరో కార్పెంటర్ చేశాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇక విచారణలో భాగంగా కాప్రాలో ఉండే బీహార్ కు చెందిన కార్పెంటర్ రాజేశ్ కుమార్ ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు నిందితుడు. తన చెల్లి పెళ్లి కోసం చేసిన అప్పులను తీర్చుకొనేందుకు దొంగతనం చేశానని పోలీసులకు చెప్పాడు రాజేష్ కుమార్. దొంగ నుంచి డ్రిల్లింగ్ మిషన్ నగలు, 13,800 నగదు, వాచ్ లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు మాదాపూర్ DCP శిల్పవల్లి.