ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు సంచలన సృష్టించింది. చివరి బంతికి సిక్స్ కొట్టి గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని SRH మరోసారి అందరి అంచనాలను తలకిందులు చేసింది. నిన్న RR పై కొండంత లక్ష్యాన్ని చేదించి ఔరా అనిపించింది.
సందీప్ వేసిన ఆఖరి ఓవర్లో 17 రన్స్ కావాల్సి ఉండగా… తొలి ఐదు బంతులకు 12 రన్స్ వచ్చాయి. చివరి బంతిని సమద్ గాల్లోకి లేపడంతో బట్లర్ క్యాచ్ పట్టాడు. SRH ఓడిపోయిందని అంతా భావించారు. కానీ అంపైర్ నోబాల్ అన్నాడు. చివరి బంతిని సమద్ సిక్స్ బాధడంతో SRH అద్భుత విజయాన్ని అందుకుంది.
కాగా, IPL-203 లో కోల్కత్తా వేదికగా ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ X పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. పంజాబ్ జట్టు ఇప్పటివరకు ఈ టోర్నీలో 10 మ్యాచ్లు ఆడి ఐదింట్లో గెలిచి పది పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. అటు కోల్కత్తా జట్టు పది మ్యాచ్ లు ఆడి నాలుగింట్లో నెగ్గి 8 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది.