కూతుర్ని ఆటో డ్రైవర్ కిడ్నాప్.. స్కెచ్ వేసి హత్య చేసిన తల్లిదండ్రులు..!

-

సాధారణంగా ఏ తల్లి దండ్రులు అయినా తమ పిల్లలు ఎదగాలి అని కోరుకుంటారు. అలాగే కూతురు ఇష్టాలను కూడా కాదనరు. కానీ ప్రేమ విషయానికి వచ్చే సరికి అంతా రివర్స్ అవుతుంటుంది. ఇందుకు ఉదాహరణ తాజాగా ఓ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన ఓ కారు డ్రైవర్ తన భార్య, కూతురుతో కలిసి హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు. ఏడో తరగతి చదువుకుంటోంది. తన కూతురుని కుమార్ అనే ఆటో డ్రైవర్ ట్రాప్ చేశాడు. 

సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మబలికి బాలికను కిడ్నాప్ చేశాడు. యూసఫ్ గూడలోని ఓ గదిలో నిర్భందించి లైంగిక వేధింపులకు గురి చేశాడు. బాలిక అక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్లిందో తల్లిదండ్రులు వెతికినా ఆచూకి లభించలేదు. తమ కూతురును కిడ్నాప్ చేసి ఆటో డ్రైవర్ ను హత మార్చాలని తల్లిదండ్రులు భావించారు. బాలిక తల్లిదండ్రులు ఆటో డ్రైవర్ ను కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు.  కాళ్లకు, చేతులకు పెద్ద బండను కట్టి సజీవంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వలోకి తోసేశారు. కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులపై కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news