SRH పై హైదరాబాద్ ఫ్యాన్స్ సీరియస్.. బ్రూక్ ను పక్కకు పెట్టి ఫిలిప్స్ ను ఆడించండి

-

ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు సంచలన సృష్టించింది. చివరి బంతికి సిక్స్ కొట్టి గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని SRH మరోసారి అందరి అంచనాలను తలకిందులు చేసింది. నిన్న RR పై కొండంత లక్ష్యాన్ని చేదించి ఔరా అనిపించింది. సందీప్ వేసిన ఆఖరి ఓవర్లో 17 రన్స్ కావాల్సి ఉండగా… తొలి ఐదు బంతులకు 12 రన్స్ వచ్చాయి.

చివరి బంతిని సమద్ గాల్లోకి లేపడంతో బట్లర్ క్యాచ్ పట్టాడు. SRH ఓడిపోయిందని అంతా భావించారు. కానీ అంపైర్ నోబాల్ అన్నాడు. చివరి బంతిని సమద్ సిక్స్ బాధడంతో SRH అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ చివర్లో కేవలం ఏడు బంతులే ఆడిన గ్లెన్ ఫిలిప్స్ 25 ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. రాజస్థాన్ యువ పెసర్ కుల్దీప్ యాదవ్ వేసిన ఓవర్లో వరసగా మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు.

ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ విజయంలో అతను ఇన్నింగ్స్ చాలా కీలకంగా మారింది. అయితే ఇన్ని రోజులు ఫిలిప్స్ ను పక్కన పెట్టి వరుసగా విఫలం అవుతున్నా కూడా హ్యరీ బ్రూక్ నే సన్రైజర్స్ ఆడించింది. దీనిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి సూపర్ ప్లేయర్ ను ఇప్పటివరకు ఎక్కడ దాచి పెట్టార్రా? అంటూ సన్రైజర్స్ మేనేజ్మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలం లో న్యూజిలాండ్ తరఫున కూడా ఫినిషర్ గా ఫిలిప్స్ చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news