కంటికి కనిపించని మహమ్మారి కరోనా మళ్ళీ మనవాళిపై తన ప్రభావాన్ని చూపించడానికి సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ తన పరిధిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇండియాలో కూడా కేసులు తక్కువ స్థాయిలో నమోదు అవుతున్న విషయం తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా రిపోర్ట్స్ ప్రకారం చూస్తే కేసులలో కొంచెం తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో 1839 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్నటితో పోలిస్తే దాదాపుగా 540 కేసులు తగ్గాయి. ఇక గత 24 గంటల్లో కోలుకున్న వారిలో 3861 మంది ఉన్నారు.
మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ గా ఉన్న కేసుల సంఖ్యను చూస్తే 25178 ఉన్నాయి. ఇక ముందు ముందు కేసుల సంఖ్య పెరగకుండా చూసుకుంటే ప్రమాదం ఉండదు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంది.