750 ఎంబిబిఎస్ సీట్లకు అడ్మిషన్లు త్వరలో జరుపుతాం – మంత్రి విడదల రజని

-

750 ఎంబిబిఎస్ సీట్లకు అడ్మిషన్లు త్వరలో జరుపుతామని ప్రకటించారు ఏపీ మంత్రి విడదల రజని. అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెండు రోజులు జరుగుతుందని తెఇపారు. వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని.. వైద్య సేవలు ఇంకా మెరుగ్గా చేయడానికే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పారు మంత్రి విడదల రజని. కోవిడ్ కాలంలో అద్భుతమైన వైద్య సేవలు అందించారు.. రోగి సంతృప్తి చెందితే మన జగనన్న ప్రభుత్వానికి మంచి పేరు అని పేర్కొన్నారు.

3255 ప్రొసీజర్ల వరకూ పెంచి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేస్తున్నామని.. జీరో వేకెన్సీ పాలసీతో నియామకాలు చేస్తున్నారు సీఎం జగన్ అని వెల్లడించారు. ప్రజలకు ప్రభుత్వాసుపత్రులలో సేవలు పెరిగాయి… ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రజలకు చాలా ఉపయోగకరంగా చేస్తున్నామన్నారు ఏపీ మంత్రి విడదల రజని. 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి… త్వరలో 17 మెడికల్ కాలేజీలు వస్తాయి.. ప్రతీ పార్లమెంటు పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని పేర్కొన్నారు. విజయనగరం, నంధ్యాల, ఏలూరు, రాజమండ్రి మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు వచ్చాయని వెల్లడించారు ఏపీ మంత్రి విడదల రజని.

Read more RELATED
Recommended to you

Latest news