బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణీ తీవ్ర తుఫాన్ గా మారిందని IMD ప్రకటించింది. ‘మోఖా’ తుఫాన్ ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
సైక్లోన్ ‘మోఖా’ శుక్రవారానికి అతి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని వివరించింది. ఆదివారం మధ్యాహ్నానికి కాక్స్ బజార్, క్యుక్ప్ మధ్య తీరం దాటుతుందని పేర్కొంది. ఇక సైక్లోన్ ‘మోఖా’ ప్రభావం వల్ల.. రెండు తెలుగు రాష్ట్రాలపై తెలంగాణ, ఏపీకి వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతేకాదు.. దీని వల్ల తెలంగాణ, ఏపీకి 2 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు పేర్కొంది.