BREAKING : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ పర్యటనలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఇవాళ మరోసారి ఏపీలో పర్యటించనున్నారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులతో పవన్ ముఖాముఖి ఉండనుంది.
ఇక ఈ కార్యక్రమం అనంతరం అంటే 13వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ రానున్నారని సమాచారం. కాగా…రేపు జనసేన పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్న పవన్ కళ్యాణ్… మండల పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి మండల పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తోన్న జనసేన….ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తోన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. ఎన్నికలకు సమాయత్తం చేసే క్రమంలోనే మండల పార్టీ అధ్యక్షులతో భేటీ కానున్నారు పవన్.