విజయవాడ బీటెక్ విద్యార్థి జీవన్ మృతి వెనుక అమ్మాయి ?

-

విజయవాడ బీటెక్ విద్యార్థి జీవన్ మృతి వెనుక ట్విస్ట్‌ చోటు చేసుకుంది. విజయవాడ బీటెక్ విద్యార్థి జీవన్ మృత దేహం నిన్న బయటపడింది. పెట్రోల్‌ పోసి.. అతన్ని చంపినట్లు సమాచారం. అయితే.. జీవన్ సూసైడ్ చేసుకున్నట్టు నిర్దారణకు వస్తున్నారు పోలీసులు. చనిపోవటానికి ముందు పెట్రోల్ బంకులో బాటిల్ లో పెట్రోల్ కొన్న జీవన్…. ఈ నెల 9 అర్థరాత్రి దాటిన తర్వాత 2 సార్లు బంకు కు వెళ్లాడట.

మొదటి సారి బాటిల్ లో పెట్రోల్ కొట్టమని సిబ్బంది చెప్పటంతో వెళ్లిపోయిన జీవన్…. రెండో సారి వెళ్ళి ఫ్రెండ్ బండి ఆగింది పెట్రోల్ కొట్టాలని అడిగి బాటిల్ లో పెట్రోల్ తీసుకు వెళ్లాడని పోలీసులు గుర్తించారు. చనిపోయే ముందు తన ఇనిస్టా గ్రాం ఖాతాలో ఇదే తనకు చివరి రోజు అని పోస్ట్ పెట్టాడు జీవన్. ఈ మెసేజ్ కి వెటకారంగా రిప్లై ఇచ్చాడు జీవన్ ఫ్రెండ్. ఈ రోజు రాత్రికి చూస్తావు కదా అని రిప్లై ఇచ్చాడు జీవన్. జీవన్ ఫోన్ కాల్ డేటా లో అమ్మాయికి ఫోన్ చేసినట్టు లభించలేదు ఎలాంటి ఆధారాలు. వీటన్నిటి బట్టి జీవన్ సూసైడ్ చేసుకున్నట్టు నిర్దారణకు వస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news